- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం సహాయనిధికి రూ. 8.30 కోట్లు
దిశ, న్యూస్‌బ్యూరో :
కరోనా నివారణ చర్యల్లో భాగంగా సీఎం సహాయనిధికి శనివారం రూ. 8.30 కోట్ల విరాళాలు అందాయి. ఐటీసీ తెలంగాణ సీఈఓ సంజయ్ సింగ్ పూరి శనివారం రూ.2 కోట్ల చెక్కును అందజేశారు. పోచంపాడ్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. కోటి విలువైన పీపీఈ కిట్లను మంత్రి కేటీఆర్‌కు అందించింది. ఎల్ అండ్ టీ నుంచి రూ.3 కోట్ల పీపీఈ, మాస్క్‌లు విరాళంగా ఇచ్చారు. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ రూ. 36.71 లక్షల చెక్కును అందించారు. ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు రూ.30 లక్షలను, ఈవెంట్స్ నౌ ప్రైవేట్ లిమిటెడ్ రూ.28 లక్షలను, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్‌ఫండ్ ప్రెసిడెంట్ జి.వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.25 లక్షలను, టోల్ ప్లస్ ఇండియా లిమిటెడ్ రూ.25 లక్షలను, రాష్ట్ర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయం తరఫున రూ.23 లక్షలను, త్రిబుల్ లైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ. 20 లక్షలను మంత్రి కేటీఆర్‌కు అందించారు.