15 నిమిషాల్లో రూ.7 లక్షల కోట్లు హుష్‌కాకి

by Anukaran |   ( Updated:2021-04-12 03:48:45.0  )
15 నిమిషాల్లో రూ.7 లక్షల కోట్లు హుష్‌కాకి
X

దిశ, వెబ్‌డెస్క్: షేర్ మార్కెట్ పేరు వింటేనే చాలామంది గుండెల్లో వణుకుపుడుతుంది. ఒక్క పెద్ద భూతంలా దానిని చూస్తారు. అది ఒక జూదం లాంటిదని అభిప్రాయపడేవారు కూడా చాలామంది ఉన్నారు. డబ్బులు ఈజీగా వస్తాయనే ఆశతో చాలామంది ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా.. అదృష్టం కలిసొస్తుందనే ఆశతో షేర్లు కొని నష్టపోతూ ఉంటారు. కానీ బాగా నాలెడ్జ్ ఉన్నవారు మాత్రం లక్షలు సంపాదిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారిలో ఎక్కువమంది డబ్బులు పొగోట్టుకున్నవారే మనకు కనిపిస్తారు.

ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటం, మళ్లీ పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధిస్తుండటంతో మార్కెట్లు ఒడిదొడుకులకు గురవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ సూచీలు భారీగా నష్టాలను మూటకట్టుకున్నాయి. దీంతో కేవలం 15 నిమిషాల్లో రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి.

Advertisement

Next Story

Most Viewed