చెత్తకు రూ. 3 వేలు..

by Shyam |
చెత్తకు రూ. 3 వేలు..
X

దిశ, సూర్యా పేట: పట్టణంలోని ఎం. జి. రోడ్డులోని శ్రీ సాయి రాం డయోగ్నస్టిక్ సెంటర్, శ్రీ విజేత డయోగ్నస్టిక్ సెంటర్ కు మున్సిపల్ కమిషనర్ రామంజులరెడ్డి జరిమానా విధించారు. రోడ్డుపై చెత్త వేయడంతో కమిషనర్ ఆదేశానుసారం సాయి రాం డయోగ్నస్టిక్ సెంటర్ యజమానికి రూ 2000, విజేత డయోగ్నస్టిక్ సెంటర్ యజమానికి రూ 1000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని వ్యాపార, వాణిజ్య, గృహ యజమానులు తప్పని సరిగా తమ ఇండ్లు, షాపులలో 3 బుట్టలు ఏర్పాటు చేసుకొని 2 బుట్టలలో తడి- పొడి చెత్తను, మరో బుట్టలో హాని కరమైన చెత్తను వేసి మున్సిపల్ ఆటోకి లేదా ట్రాక్టర్ కి అందివ్వాలన్నారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో, రోడ్ల మీద, మురికి కాలువల్లో చెత్త వేస్తే రూ.500 నుండి రూ.5000 వరకు జరిమానా విధిస్తామననారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీను, హెల్త్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed