చదువు మానేసి దొంగతనాలు.. రూ. 26.50 లక్షల సొత్తు స్వాధీనం

by Sumithra |
చదువు మానేసి దొంగతనాలు.. రూ. 26.50 లక్షల సొత్తు స్వాధీనం
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జవహార్ నగర్ పీఎస్ పరిధిలో నివసించే మొలుగు వీరారెడ్డి మార్చి 16 మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి తన భార్యతో కలిసి నాచారం చాంద్ పాషా దర్గాకు వెళ్లాడు. సాయంత్రం 5 గంటలకు తిరిగొచ్చే సరికి ఇంటి ప్రధాన ద్వారం లాక్ పగులగొట్టినట్టుగా గుర్తించారు. ఈ సమయంలో ఇంట్లోని బంగారం, వెండి, నగదు లేకపోవడాన్ని గమనించారు. దీంతో అదే రోజు జవహర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు యాప్రాల్ ప్రాంతంలో ఉండే రోషన్ కుమార్ సింగ్ (21), మల్లెపు చేతన్ (21)లను అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్టుగా అంగీకరించినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వీరిద్దరు చదువు మానేసి ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటు పడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా వీరి నుంచి రూ.48.5 తులాల బంగారం, 53.4 తులాల వెండి, రూ.1.55 లక్షల నగదుతో పాటు ఒక

ఐ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్ చేశారు. కేసు దర్యాప్తులో మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, డీసీపీలు ( క్రైమ్) యాదగిరి, సలీమ, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, సీసీఎస్ మల్కాజిగిరి ఏసీపీ వెంకన్న నాయక్, ఇన్ స్పెక్టర్లు బాలు చౌహాన్, రవిబాబు, మధుకుమార్ ఇతర సిబ్బందిని సీపీ మహేష్ భగవత్ అభినందించారు.

Advertisement

Next Story