- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సభ్యత్వం తీసుకుంటే రూ. 2 లక్షల ప్రమాద బీమా: శ్రీధర్ బాబు
దిశ, కాటారం: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సభ్యత్వంపై దృష్టి సారించింది. సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాటారం మండలంలో అట్టహాసంగా ప్రారంభించారు. కార్యకర్తలకు సభ్యత్వంతోపాటు రూ. 2 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు శ్రీధర్ బాబు వివరించారు. కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదులో మహిళలకు, యువతకు పెద్దపీట వేయాలన్నారు. పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల్లో సుమారు 70 శాతం డిజిటల్ ఫోన్లే ఉన్నాయని, బూత్ కు 25 మంది చొప్పున కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాలు చేయించాలని శ్రీధర్ బాబు అన్నారు. బూత్ స్థాయి కో-ఆర్డినేటర్లు కాంగ్రెస్ సభ్యత్వాన్ని అధికంగా చేయించాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్.. కేంద్రంలో బీజేపీ పార్టీలు రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో శశిభూషణ్ కాచే, కాటారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమూరి ప్రభాకర్ రెడ్డి, మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, డీసీసీ ఉపాధ్యక్షుడు గద్దె సమ్మిరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుల్లూరి రాజేశ్వరరావు, కొట్టే శ్రీహరి కొట్టే ప్రభాకర్ మొగిలి విక్రమ్, రాజా వీరు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.