బీచుపల్లి ఆలయం తరఫున రూ.15 లక్షల విరాళం

by vinod kumar |
బీచుపల్లి ఆలయం తరఫున రూ.15 లక్షల విరాళం
X

దిశ, మహబూబ్ నగర్: ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజా శ్రేయస్సుకు బీచుపల్లి ఆలయ నగదును ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని గద్వాల మాజీ ఎమ్మెల్యే, ఆలయం ధర్మకర్త డి.కె.భరతసింహారెడ్డి అన్నారు. జిల్లాలో కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన సదుపాయాల కోసం బీచుపల్లి ఆలయం తరఫున రూ.15 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ శృతి ఓజాకు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిధులను జిల్లాలోని గద్వాల్, అల్లంపూర్ నియోజకవర్గాలలో కరోనా కట్టడి కోసం వినియోగించాలని కోరినట్లు తెలిపారు.

Tags: beechupally, temple, 15 lakhs,donates, dk bharata simha reddy, gadwal

Advertisement

Next Story