- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అభివృద్ధి జేసుడే ఇగ: జగదీశ్ రెడ్డి
దిశ, నల్గొండ: అవాంతరాలను అధిగమించిన సూర్యాపేట పురపాలక సంఘం.. ఇకమీదట అభివృద్ధిపై దృష్టి సారించబోతోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీ పాలకవర్గం రూ. 128.95 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలియజేశారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్‌లో మూడో వంతు కేటాయించామని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పట్టణాన్ని సుందరీకరించనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ అన్నపూర్ణమ్మ, వైస్ ఛైర్మన్ పుట్టా కిషోర్, మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.