దసరా కానుకగా RRR.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్

by Anukaran |   ( Updated:2021-01-25 06:11:14.0  )
దసరా కానుకగా RRR.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక మూవీ ‘RRR’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ కానున్నట్లు ప్రకటించాడు జక్కన్న. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురంభీంగా కనిపించబోతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌.. అగ్ని, నీరు కలిసిన ఆపలేని శక్తికి సాక్ష్యంగా నిలవబోతుందన్నారు.

అక్టోబర్ 13న భారతీయ సినిమాను అత్యుత్తమ అవతార్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. కాగా ,ఈ సందర్భంగా చరణ్ గుర్రం మీద, తారక్ బుల్లెట్‌పై కలిసి పోరాడేందుకు వెళ్తున్న ఫొటో పోస్ట్ చేసింది మూవీ యూనిట్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ‘RRR’ క్లైమాక్స్ జరుగుతుండగా అజయ్ దేవగన్, ఆలియా భట్, సముద్రఖని, శ్రీయా శరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, సినిమాటోగ్రఫర్ సెంథిల్.

Advertisement

Next Story