RRR టీం వర్క్ ఫ్రమ్ హోమ్

by Shyam |
RRR టీం వర్క్ ఫ్రమ్ హోమ్
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి దాదాపు ప్రేక్షకులందరికీ తెలుసు. ప్రతీ విషయంలో పర్‌ఫెక్షన్ కోరుకునే జక్కన్న… ఒక్కో సీన్ కోసం పగలు రాత్రి కష్టపడతాడు. హండ్రెడ్ పర్సెంట్ ఓకే అనుకుంటేనే ఫైనలైజ్ చేస్తాడు తప్పా… ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమా షూటింగ్ వాయిదా పడింది. కానీ ప్రేక్షకులకు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 8న సినిమా విడుదల కావాలంటే నిరంతం శ్రమించాల్సి ఉంటుంది టీం. అందుకే వర్క్ ఫ్రం హోమ్ మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు సినిమాకు స్వరాలు సమకూరుస్తున్న సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి. జక్కన్న, ఎన్టీఆర్, మదన్ కర్కి, కీరవాణి వీడియోకాల్ ఫోటోను షేర్ చేశారు. మూడు అడుగుల కన్నా ఎక్కువ దూరం ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామని.. సామాజిక దూరం(సోషల్ డిస్టెన్సింగ్) పాటిస్తున్నామని తెలిపారు. కాగా సోషల్ మీడియాలో పిక్ వైరల్ అయింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌కు ‌జక్కన్న దర్శకత్వం వహిస్తుండగా… డీవీవీ ఎంటర్టైన్మెట్స్ బ్యానర్‌పై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముతిరఖని, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా… ఎలిసన్ డూడి, రే స్టీవెన్సన్ విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారు.


Tags: RRR, NTR, RamCharan Tej, MMKeeravani, SSRajamouli, WorkFromHome

Advertisement

Next Story