ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సంక్రాంతి బరిలో ‘RRR’ ?

by Shyam |   ( Updated:2021-09-28 05:29:43.0  )
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సంక్రాంతి బరిలో ‘RRR’ ?
X

దిశ, సినిమా : సంక్రాంతి పండగ వచ్చిందంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండివంటలు, కొత్త అల్లుళ్లు, కోడి పందాలతోపాటు కొత్త సినిమాల సందడి కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పండగకు తమ అభిమాన హీరోల కొత్త సినిమాల రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ 2022లో మాత్రం సినీ అభిమానులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను సంక్రాంతి బరిలో దించేందుకు సిద్ధం చేస్తున్నారని, వారం రోజుల్లో మేకర్స్ రిలీజ్ డేట్ అఫిషియల్‌ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. అయితే ‘ఆర్ఆర్ఆర్’కు పోటీగా మిగతా చిత్రాలను రిలీజ్ చేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదని, బడా నిర్మాతలు సైతం వెనకడుగు వేస్తున్నారని సిని వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈసారైనా రాజమౌళి అనుకున్నట్లు సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తాడో.. లేకపోతే అప్పుడు కూడా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లనున్నాడో చూడాలి.

Advertisement

Next Story