‘ఆర్ఆర్ఆర్’ అప్‌డేట్: ఒలివియా లుక్‌కు యూత్ ఫిదా!

by Shyam |
‘ఆర్ఆర్ఆర్’ అప్‌డేట్: ఒలివియా లుక్‌కు యూత్ ఫిదా!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’ టీం బ్యూటీఫుల్ అప్‌డేట్ ఇచ్చింది. హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఇప్పటికే తెలియగా.. తన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ విష్ చేసింది. సినిమాలో జెన్నీఫర్‌ పాత్రలో కనిపించనున్న ఒలివియా చిరునవ్వుతో ఉన్న ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. మూవీలో తారక్‌కు జోడిగా చక్కగా సెట్ అయిపోతుందని మురిసిపోతున్న ఫ్యాన్స్.. లుక్ అదిరిపోయిందని చెప్తున్నారు. ఆలివ్ గ్రీన్ డ్రెస్‌లో చాలా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ లుక్‌లో ఉన్న ఒలివియా ఇక నుంచి యూత్ క్రష్ అయిపోయిందనే చెప్పాలి. జెన్నీఫర్ ఫస్ట్ లుక్‌కి అంతలా రెస్పాన్స్ వచ్చింది.

1920 ఇండియన్ రెవల్యూషనరీస్ ఫిక్షనల్ టేల్‌గా వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్మాత్మకంగా తెరకెక్కిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయా శరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రానికి డివివి దానయ్య నిర్మాత కాగా.. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కానుంది.

Advertisement

Next Story