'RRR' క్రేజీ అప్డేట్ : బైక్ పై నవ్వులు చిందిస్తున్న రామరాజు- భీమ్

by Anukaran |   ( Updated:2021-06-29 02:31:38.0  )
rrr latest update news
X

దిశ, వెబ్‌డెస్క్: యావత్ సినీ ప్రపంచం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై యావత్ సినీ యాబైమానులు భారీ అంచనాలేనే పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా కరోనా లాక్ డౌన్ వలన అది కాస్త వాయిదా పడింది. ఇటీవల లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ షూటింగ్ షురూ చేసిన మేకర్స్ ఈ సినిమాపై క్రేజీ అప్డేట్ తో పాటు ఫ్యాన్స్ పండగ చేసుకొనే ఒక ఫోటోను షేర్ చేశారు.

“షూటింగ్ శరవేగంగా జరుగుతోందని.. రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని వెల్లడించారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ రెండు భాషలకు డబ్బింగ్‌ పూర్తిచేశారని, మిగిలిన భాషల్లో డబ్బింగ్‌ త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు” పేర్కొంది. ఇక ఫొటోలో ఒకే బైక్ పై చరణ్, ఎన్టీఆర్ నవ్వులు చిందిస్తూ రైడ్ కి వెళ్తున్నట్లు ఉంది. ఇక ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫొటోలో కనిపించడంతో వారి అభిమానులు ఉబ్బితబ్బిబ్బులవుతున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా.. ఎన్టీఆర్ గోండ్రు బొబ్బిలి కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. ఇక అలియా భట్ – ఓలివియా మోరిష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం మేకర్స్ తెలిపినట్లే అక్టోబర్ 13 నే విడుదల కానుంది.

Advertisement

Next Story