సీఐడీ ఉన్నతాధికారికి RRR లీగల్ నోటీసు

by srinivas |   ( Updated:2021-06-04 23:13:15.0  )
సీఐడీ ఉన్నతాధికారికి RRR లీగల్ నోటీసు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లీగల్ నోటీస్ జారీ చేశారు. అరెస్ట్ సమయంలో తన ఫోన్ తీసుకున్నారని, ఆ ఫోన్ వెంటనే తిరిగి ఇచ్చేయాలని కోరారు. ఫోన్‌లో విలువైన సమాచారం ఉందని, కుటుంబసభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను పార్లమెంట్‌లో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, విధులు నిర్వర్తించేందుకు ఫోన్ తిరిగివ్వాలని కోరారు.

ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న తన ఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపించలేదని RRR ఆరోపించారు. కాగా, ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారనే కారణంతో దేశద్రోహం కేసు మీద ఏపీ సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజును ఇటీవల అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. సుప్రీంకోర్టు కండీషనల్ బెయిల్ ఇవ్వడంతో.. RRR విడుదల అయ్యారు.

Advertisement

Next Story