రిలీజ్‌కు ముందే ‘ఆర్ఆర్ఆర్’ చూసే భాగ్యం..

by Anukaran |   ( Updated:2021-01-08 05:11:30.0  )
రిలీజ్‌కు ముందే ‘ఆర్ఆర్ఆర్’ చూసే భాగ్యం..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఓ అభిమాని గతంలో జనవరి 8న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అనే అనౌన్స్‌మెంట్‌ను షేర్ చేస్తూ.. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయను ట్యాగ్ చేశాడు. ‘సార్.. మీరు ప్రకటించిన తేదికి థియేటర్స్‌లో సినిమాలేదు.. బిగ్ స్క్రీన్‌పై హీరోలు(తారక్, చరణ్) కనిపించడం లేదు’ అని బాధపడ్డాడు. కాగా ఈ ట్వీట్‌కు స్పందించిన జక్కన్న తనయుడు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. ‘మీలాంటి గొప్ప అభిమానులకు గొప్ప అనుభవాన్ని అందిస్తాం.. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మెయిల్ చేయండి. ఆర్ఆర్ఆర్ మూవీ సెట్స్ సందర్శించి, ప్రత్యక్షంగా మన హీరోల యాక్షన్ సీన్స్ చూసే అవకాశం పొందే మొదటి అభిమాని మీరే అవుతారు’ అని హామీ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ను ఆరాధించే ఇలాంటి మరింత మంది అభిమానులకు కూడా ఈ అవకాశం దక్కుతుందన్నారు. #RRRAdmirer ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్న ఈ ఆఫర్ కోసం వెంటనే ట్విట్టర్ ఎకౌంట్స్ క్రియేట్ చేసుకున్న అభిమానులు.. ప్లీజ్ మమ్మల్ని కూడా ఆ లిస్ట్ చేర్చాలని కోరుతున్నారు.

https://twitter.com/ssk1122/status/1347466101186129922?s=20

Advertisement

Next Story