- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దివ్యాంగుడిని రక్షించిన రైల్వే ఆఫీసర్.. వీడియో వైరల్
దిశ, ఫీచర్స్: అంగవైకల్యం ఉన్నప్పటికీ కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు ఓ దివ్యాంగుడు. ఈ క్రమంలో ట్రైన్‌లో ఉన్న ఓ వ్యక్తి చేయి పట్టుకుని ప్లాట్ ఫామ్‌పై పరుగెత్తాడు. కానీ, ట్రైన్ స్పీడ్‌ను అందుకోవడం అతని వల్ల కాలేదు.. ఇంకొన్ని క్షణాలైతే అదుపు తప్పి, ట్రాక్ మీదపడి ప్రాణాలు కోల్పోయేవాడే. ఇంతలోనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించి దివ్యాంగుడిని రక్షించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని పన్వెల్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరగ్గా.. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దివ్యాంగ ప్యాసింజర్‌ను కాపాడిన ఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించిన మంత్రి.. కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించొద్దని, నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికులను కోరారు. ఈ విషయమై స్పందిస్తున్న నెటిజన్లు.. రైల్వే ఆఫీసర్‌ను అభినందిస్తుండటంతో పాటు దివ్యాంగుడి ప్రాణాలు కాపాడినందుకు అతినికి రివార్డు ఇవ్వాలని కోరుతున్నారు. రైల్వే సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నారు.
पनवेल, मुंबई में RPF सुरक्षा कर्मी की सतर्कता, और त्वरित एक्शन से एक दिव्यांग यात्री को ट्रेन की चपेट में आने से बचाया गया।
इस प्रकार चलती ट्रेन में चढ़ने का प्रयास, आपके लिये घातक सिद्ध हो सकता है। आपका जीवन अमूल्य है, मेरा आग्रह है कि नियमों का पालन करें, व सुरक्षित रहें। pic.twitter.com/dKZsL7Ph8e
— Piyush Goyal (@PiyushGoyal) February 6, 2021