రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్ 

by Harish |
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్ 
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది. మీటియర్ 350 పేరుతో ఆవిష్కరించిన ఈ బైక్ 350 సీసీ సెగ్మెంట్‌లో రూ. 1.76-1.91 లక్షల(ఎక్స్‌షోరూమ్)ధరలో అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ తెలిపింది. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఎస్‌సీడీ స్క్రీన్, ఫ్యుయెల్ గ్రాఫ్ బార్, ట్విన్ ప్యాడ్ క్లస్టర్, సర్వీస్ రిమైనడర్ లాంటి అధునాతన ఫీచర్లు ఈ బైక్ సొంతమని, ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న థండర్‌బర్డ్ 350ఎక్స్ మోడల్‌ను ఈ సరికొత్త మీటియర్ బైక్ రీప్లేస్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ బైక్ ఎయిర్ కూల్‌డ్, సింగిల్ సిలిండర్ బీఎస్6 ఇంజిన్‌తో లభిస్తుందని కంపెనీ తెలిపింది. హాలోజన్ హెడ్‌ల్యాంప్‌తో పాటు ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్, రైజ్‌డ్ హ్యాండిల్ బార్ లాంటి ఫీచర్లను కలిగి ఉందని, ఇది మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఎంట్రీ లెవల్ వేరియంట్ ఫైర్‌బాల్ పేరుతోనూ, హై-రేంజ్ వేరియంట్‌లో స్టెల్లార్, సూపర్‌నోవా పేర్లతో వస్తుందని పేర్కొంది.

మొత్తం ఏడు రంగుల్లో ఈ బైక్‌ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. మీటియర్ 350 ఫైర్‌బాల్ ప్రారంభ ధర రూ. 1.75,817 గా ఉండగా, స్టెల్లార్ రూ. 1,81,326, సూపర్‌నోవా రూ. 1,90,536కి లభించనుంది. ఈ సరికొత్త క్రూజర్ బైక్ అనుభవం ఉన్న రైడర్లతో పాటు కొత్త వాహన కొనుగోలుదారులకు సరైన ఎంపికగా నిలుస్తుందని, అదేవిధంగా ఈ బైక్‌ను కస్టమైజ్ ఎంపికలో ఎంచుకోవచ్చని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed