ఆ జెర్సీతో బరిలోకి దిగనున్న ఆర్సీబీ

by Shyam |
ఆ జెర్సీతో బరిలోకి దిగనున్న ఆర్సీబీ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 13వ సీజన్‌లోని లీగ్ మ్యాచ్‌లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఆదివారం చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ప్రతీ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ రెగ్యులర్ జెర్సీ కాకుండా ‘గ్రీన్ జెర్సీ’ ధరించి ఆడుతుంది. ప్రపంచంలో కాలుష్యం పెరిగిపోతుండటంతో పర్యావరణానికి హాని జరుగుతుందని.. కాలుష్యాన్ని తగ్గించాలంటే చెట్లను పెంచడమే పరిష్కారమని అందరి తెలుసు. ఇలా చెట్ల పెంపకం యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి ఈ గ్రీన్ కలర్ జెర్సీని ధరించి ఆర్సీబీ బరిలోకి దిగుతున్నది. ఆదివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో గ్రీన్ కలర్ జెర్సీని ధరించబోతున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు ఆ జెర్సీని చూపుతూ ఒక వీడియోను ఆర్సీబీ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story