భారీ టార్గెట్ ఇచ్చిన బెంగళూరు

by Anukaran |
భారీ టార్గెట్ ఇచ్చిన బెంగళూరు
X

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్(32), ఆరోన్‌ఫించ్ (47) పరుగులు చేసి పెవిలియన్ చేరినా.. మంచి ఇన్నింగ్స్‌ ఆడారు.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ, మిడిలార్డర్‌ ఏబీ డివిలియర్స్ చివరి వరకు ‌ క్రీజులో నిలబడ్డారు. ముఖ్యంగా ఏబీ డివిలియర్స్(73*) 360 డిగ్రీస్ ఇన్నింగ్స్‌ ప్రదర్శించాడు. ఏకంగా 33 బంతుల్లో 5 ఫోర్లు. 6 సిక్సర్లతో చెలరేగి 73 పరుగులు చేసి నాటౌ‌ట్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్ కోహ్లీ 28 బంతుల్లో (33*) పరుగులతో రాణించాడు. దీంతో బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగలిగింది.

Royal Challengers Bangalore Innings:

1. ఆరోన్ ఫించ్ b ప్రసీద్ 47(37)
2. దేవదత్ పడిక్కల్ b రస్సెల్ 32(23)
3. విరాట్ కోహ్లీ నాటౌట్ 33(28)
4. ఏబీ డివిలియర్స్ నాటౌట్ 73(33)

ఎక్స్‌ట్రాలు: 9

మొత్తం స్కోరు: 194

వికెట్ల పతనం: 67-1 (దేవదత్ పడిక్కల్, 7.4), 94-2 (ఆరోన్ ఫించ్, 12.2)

బౌలింగ్:
ప్యాట్ కమ్మిన్స్ 4-0-38-0
ప్రసీద్ కృష్ణ 4-0-42-1
ఆండ్రూ రస్సెల్ 4-0-51-1
వరుణ్ చక్రవర్తి 4-0-25-0
కమలేష్ నాగర్‌కోటి 4-0-36-0

Advertisement

Next Story