ఈస్ట్ బెంగాల్‌కు తొలి విజయం

by Shamantha N |
ఈస్ట్ బెంగాల్‌కు తొలి విజయం
X

దిశ, స్పోర్ట్స్ :ఐఎస్ఎల్ 2020-21 సీజన్‌లో ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం సాయంత్రం తిలక్ మైదాన్‌లో ఒడిషా ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సీజన్‌లో ఈస్ట్ బెంగాల్‌కు ఇదే తొలి విజయం కాగా, ఒడిషా జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా పరాజయాల పరంపర కొనసాగిస్తున్నది. ఈస్ట్ బెంగాల్ ఆటగాళ్లు ఆట ప్రారంభం నుంచి ఒడిషా డిషెన్స్‌పై దాడిమొదలు పెట్టారు. 12వ నిమిషంలో ఆంటోనీ పికింగ్టన్, 39వ నిమిషంలో జాక్వెస్ మఘోమా, 88వ నిమిషంలో బ్రైట్ ఎనోబాఖారే గోల్స్ చేసి ఈస్ట్ బెంగాల్‌ను గెలిపించారు. చివరి నిమిషంలో ఒడిషా ఆటగాడు డానీ ఫాక్స్ గోల్ చేసినా ఆధిక్యాన్ని 3-1 మాత్రం తగ్గించగలిగాడు.

ఇక రాత్రి ఫటోర్డా స్టేడియంలో నార్త్ఈస్ట్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ జట్టు 2-0 తేడాతో విజయం సాధించింది. తొలి అర్దభాగంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రత్యర్థి గోల్ పోస్టులపై దాడులు చేసినా సఫలం కాలేదు. ఇక 51వ నిమిషంలో ఏటీకే మోహన్ బగాన్ స్ట్రైకర్ రాయ్ కృష్ణ గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. అయితే 58వ నిమిషంలో నార్త్ఈస్ట్ యునైటెడ్ డిఫెండర్ బెంజిమిన్ లంబోట్ ఓన్ గోల్ చేసి మోహన్ బగాన్‌కు 2-0 ఆధిక్యాన్ని తీసుకొని వచ్చాడు. బంతిని గోల్ కాకుండా అడ్డుకునే క్రమంలో ఓన్ గోల్ చేసి ప్రత్యర్థి జట్టుకు గోల్ అందించాడు. ఆ తర్వాత ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యారు. మోహన్ బగాన్ జట్టు 2-0 తేడాతో విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న మోహన్ బగాన్ జట్టు 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

Advertisement

Next Story