- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లారీలా తిరుగుతున్నాడు.. తప్పులేదా?: వర్ల రామయ్య
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లారీలా రాష్ట్రం మొత్తం కలియదిరుగుతున్నాడు.. అతనేమన్నా కరోనాకి అతీతుడా?.. అతనిని ఎందుకు క్వారంటైన్‌కు పంపడం లేదు? ఇది మీ ప్రభుత్వం తప్పిదం కాదా? అని టీడీపీ నేత వర్ల రామయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డి, వైజాగ్, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ, సోషల్ మీడియాలో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా ఆయనపై వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ,
ముఖ్యమంత్రిగారూ.. 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తన తండ్రి అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లలేదు. మరో ఏ2 విజయసాయిరెడ్డి గారు నేషనల్ పర్మిట్ లారీలాగ రాష్ట్రాలన్నీ కలియదిరుగుతున్నాడు. ఆయనను క్వారంటైన్‌కి పంపక్కర్లేదా? కరోనాకు అతీతుడా? మీ ప్రభుత్వం తప్పు కాదూ? అంటూ నిలదీశారు.
Tags: tdp, ysrcp, varla ramaiah, vijayasai reedy, ap cm, jagan