- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు సీఎంల రహస్య ఒప్పందంపై ఉద్యమం: బండి సంజయ్
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణాబోర్డుకు సీఎం కేసీఆర్ రాసిన లేఖ నామమాత్రమేనని, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఇద్దరు సీఎంల రహస్య ఒప్పందాలపై ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కృష్ణాజలాల వియోగం, రాష్ట్రం ప్రభుత్వ వైఫల్యాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరగ్గా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు పాల్గొన్నారు. నదీ జలాల వాడకంలో కేసీఆర్ విధానాలపై ప్రత్యక్ష పోరాటాలు చేపట్టాలని ఈ సంద్భంగా నిర్ణయించారు. సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణకు కృష్ణానదీ జలాల వినియోగం విషయంలో కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వం ఆరేళ్లుగా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ వాటా నికర జలాలు వాడుకునే ప్రయత్నం చేస్తుందని, దీంతో దక్షిణ తెలంగాణలోని పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉందన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణానది జలాల్లో తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన నీటి హక్కుల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో సమగ్రంగా చర్చించి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాటాడుతూ పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ నిర్లక్ష్యంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు చుక్కనీరు రావాడం లేవని మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని డీకే అరుణ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంటోందని మాజీ ఎంపీ వివేక్ విమర్శించారు. అనంతరం కృష్ణానది జలాలపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.