వన్డేల్లో సూపర్ ఓవర్ అవసరమా?: రాస్ టేలర్

by Shiva |
వన్డేల్లో సూపర్ ఓవర్ అవసరమా?: రాస్ టేలర్
X

దిశ, స్పోర్ట్స్: గత ఏడాది లార్డ్స్‌లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ఆడించారు. అదీ టైగా మారడంతో అత్యధిక ఫోర్లు కొట్టిన ఇంగ్లండ్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించారు. ఆనాటి నుంచి ఐసీసీ నిబంధనలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ విషయమై న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ స్పందించాడు. ‘వన్డే ఫార్మాట్‌లో సూపర్ ఓవర్ అవసరమా? ఫుట్‌బాల్, ఇతర క్రీడలు లేదా టీ20లోనైతే ఉపయోగం ఉంటుంది. కానీ, 50 ఓవర్ల మ్యాచ్‌కు సూపర్ ఓవర్ అవసరం లేదు. ఫైనల్స్‌ టై అయితే ఇరు జట్లకు వరల్డ్ కప్‌ను సంయుక్తంగా ప్రకటించాలి. కానీ, ఇది మంచి పద్ధతి కాదు. ఆరోజు ఫైనల్స్‌లో సూపర్ ఓవర్ నిబంధన అప్పటికప్పుడు తీసుకొచ్చినట్లు అనిపించింది’ అని రాస్ టేలర్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed