రూప IPS.. 20ఏళ్లలో 40బదిలీలు

by Anukaran |   ( Updated:2021-01-02 02:09:35.0  )
రూప IPS.. 20ఏళ్లలో 40బదిలీలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆవిడ పేరు డి.రూప ఐపీఎస్ కేడర్ అధికారిణి. తన 20 ఏళ్ల సర్వీసులో 40 సార్లు బదిలీ అయ్యారు. అందుకు కారణం ముక్కుసూటి మనిషి. నిజాయితీకి మారుపేరు. కర్ణాటక రాష్ట్రం దేవనగరిలో జన్మించిన రూప.. 2000ల సంవత్సరంలో UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. ఆ సమయంలో ఆలిండియా 43 ర్యాంక్ సాధించారు.

ప్రస్తుతం కర్ణాటక మొదటి మహిళా హోం సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న ఆమెను ప్రభుత్వం తాజాగా హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్‌గా బదిలీ చేసింది. ఇదిలాఉండగా, రూప తన సర్వీసులో రెండు సార్లు ప్రెసిడెంట్ మెడల్ (2016, 2017)లో అందుకున్నారు.

Advertisement

Next Story