- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగుల రాసలీలలకు ‘జూమ్’ చెక్..!
దిశ, వెబ్‌డెస్క్ :
లాక్డౌన్ సమయంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ప్రకటించాయి. అయితే, ఇంటి నుంచి జాబ్ చేస్తున్న చాలా మంది ఉద్యోగులు కట్టు తప్పుతున్నారు. ఇంట్లోనే ఉన్నాం కదా అని షార్ట్స్‌లో పని చేస్తున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా, వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో ‘కెమెరా ఆన్’లో ఉందన్న విషయం మరిచి తమ గర్ల్‌ఫ్రెండ్ లతో ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్నారు.
తీరా ఆ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించే సరికి షాక్ అవడం వారి వంతవుతోంది. ఇటీవల ఫిలిప్పిన్స్‌లోని మనీలాలో తన సెక్రటరీతో ‘జూమ్ లైవ్’లో సెక్స్‌లో పాల్గొంటూ ఓ ప్రభుత్వ అధికారి దొరకగా అతన్ని ఉన్నతాధికారులు తప్పించారు.
తాజాగా, జీసన్ ఎస్టిల్ అనే ఓ అధికారి తన గ్రామకౌన్సిల్ సభ్యులతో జూమ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఆయనకు టెక్నాలజీ మీద అంతగా పట్టులేకపోవడంతో కాన్ఫరెన్స్ ముగిశాక, వీడియో ఆఫ్ చేయబోయి వేరే బటన్ నొక్కి.. తన సెక్రటరీతో శృంగారం చేశాడు. ఆ సమయంలో కెమెరా ఆన్‌లోనే ఉంది. ఇదంతా జూమ్ లైవ్‌లో ఉన్నవారికి స్పష్టంగా కనిపిస్తోంది. అతడికి మాత్రం ఆ విషయం తెలియలేదు.
కాసేపటికి సెక్రటరీకి అనుమానం వచ్చి ఈ విషయం చెప్పగా.. వెంటనే తేరుకున్న అతను కెమెరా ఆఫ్ చేశాడు. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. జూమ్లైవ్లో ఉన్న కొందరు ఆ సీన్లను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు కాస్తా వైరల్ కావడంతో.. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇద్దరినీ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేశారు.