‘రాజీవ్ ఖేల్‌ రత్న’కు రోహిత్ నామినేట్

by Shyam |
‘రాజీవ్ ఖేల్‌ రత్న’కు రోహిత్ నామినేట్
X

దిశ, స్పోర్ట్స్: దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం (highest sports award) ‘రాజీవ్ ఖేల్ రత్న’(Rajiv Khel Ratna) అవార్డుకు టీం ఇండియా (Team India) పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నామినేట్ (Nominate) అయ్యాడు.

రోహిత్ శర్మతోపాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Wrestler Vinesh Phogat), టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా (Table tennis player Manika Batra), రియో పారా ఒలంపిక్ బంగారు పతక విజేత మరియప్పన్ తంగవేలు (Rio Paralympic gold medalist Mariyappan Thangavelu) పేర్లను కేంద్ర ప్రభుత్వానికి క్రీడా మంత్రిత్వ శాఖ (Ministry of Sports)సిఫార్సు చేసింది.

క్రీడా మంత్రిత్వ శాఖ (Ministry of Sports) నియమించిన సెలెక్షన్ కమిటీలోని 12మంది సభ్యులు ఈ నలుగురి పేర్లను నామినేట్ (Nominate)చేశారు. దేశ క్రీడా చరిత్ర ( Indian sports history)లో నలుగురు క్రీడాకారులు (Four players) ఒకే ఏడాది ఖల్‌రత్న (Khel Ratna) అవార్డుకు నామినేట్ కావడం ఇది రెండో సారి.

2016లోనూ నలుగురిని కమిటీ నామినేట్ (Nominate) చేసింది. క్రికెట్‌ (cricket)లో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్(1998), ఎంఎస్ ధోని(2007), విరాట్ కోహ్లీ(2018)లు మాత్రమే రాజీవ్ ఖేల్ రత్న (Rajiv Khel Ratna) అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు నామినేట్ అయిన నాలుగో క్రికెటర్ రోహిత్ శర్మ.

2019లో రోహిత్ శర్మ అత్యున్నత ప్రదర్శన (highest performance)కారణంగా ఈ అవార్డుకు సిఫార్సు చేసినట్లు సెలెక్షన్ కమిటీ సభ్యుడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag)పేర్కొన్నాడు. ఇక వినేష్ ఫోగట్ 2018 కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించింది. మరియప్పన్ తంగవేలు 2016 రియో పారా ఒలంపిక్స్‌ హై జంప్ కేటగిరీ విభాగంలో బంగారు పతకం సాధించాడు. టేబుల్ టెన్నిస్‌లో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తూ ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న మనిక బాత్రా పేరు సెలెక్షన్ కమిటీ సిఫార్సు చేసింది.

Advertisement

Next Story

Most Viewed