- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛీ ఛీ ఆ పడుకోవడం ఏంటండి? నన్ను ఎగతాళి చేస్తారు
దిశ,వెబ్‌డెస్క్: ఇండియా- ఇంగ్లాండ్ మధ్య రెండు రోజుల్లో ముగిసిన డే అండ్ నైట్ టెస్ట్ కు ఆతిథ్యం ఇచ్చిన మోతేరా (మోడీ) పిచ్ పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. టెస్ట్ మ్యాచ్ కు ఇలాంటి గ్రౌండ్ ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ భారత్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం మోతేరాను తప్పుబట్టడానికి వీల్లేదని అన్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు అతిగా డిఫెన్స్ కు పోవడం వల్లే వికెట్లు కోల్పోయారని స్పష్టం చేశారు.
మోతేరా పిచ్ టెస్ట్ లకు పనికి రాదని, అందుకే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 125 పరుగులకే ఆలౌట్ అయినట్లు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ఇలాంటి పిచ్‌లపై హర్భజన్, అనిల్ కూంబ్లే వంటి క్రికెటర్లు వరుసగా వెయ్యి వికెట్లు సులువుగా తీసేవారని యువరాజ్ సింగ్ అన్నారు.
త్వరలో మోతేరా పిచ్ పై ఇండియా-ఇంగ్లాండ్ 4వ టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌లో బిజీ అయ్యారు. ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ శర్మ మోతేరా పిచ్‌పై 4వ టెస్ట్ ఎలా జరుగుతుందోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, మైదానంలో పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ ఫోటోలపై నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రోహిత్ శర్మ భార్య రితికా సైతం తనదైన స్టైల్లో మీరు ఇలా పడుకున్నందుకు నన్ను ఎగతాళి చేస్తారు’ అంటూ రిప్లయి ఇచ్చింది.