టెస్టులో అయ్యర్ సెంచరీ.. రోహిత్ శర్మ మాస్ డ్యాన్స్ స్టెప్పులు వైరల్ (వీడియో)

by Anukaran |   ( Updated:2023-12-15 17:21:18.0  )
టెస్టులో అయ్యర్ సెంచరీ.. రోహిత్ శర్మ మాస్ డ్యాన్స్ స్టెప్పులు వైరల్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో అరగ్రేటం చేసిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సెంచరీతో అదరగొట్టాడు. మ్యాచ్ రెండో రోజు మార్నింగ్ సెషన్‌లో వంద పరుగులు పూర్తి చేసిన అయ్యర్.. 105 రన్స్ చేసిన ఔటయ్యాడు. ఈ క్రమంలో అయ్యర్ బ్యాటింగ్‌పై టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు.

అంతేకాకుండా శ్రేయస్, శార్దుల్ ఠాకుర్‌తో పాటు హిట్ మ్యాన్ డ్యాన్స్ చేసిన ఓ వీడియోను షేర్ చేశాడు. ఫేమస్ బాలీవుడ్ సాంగ్ ‘చమ్ చమ్ నచ్దీ ఫిరాన్’ అనే సాంగ్‌కు వీరంతా స్టెప్పులు వేశారు. ఈ వీడియోను రోహిత్ షేర్ చేస్తూ..‘చాలా బాగుంది. సరైన విధంగా కాలు కదిపావు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ డ్యాన్స్ లాగే సెంచరీ కూడా అద్భుతమంటూ కామెంట్స్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed