- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విరాట్ కోహ్లీకి ఘోర అవమానం.. కారణం అదేనా..?
దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా వన్డే కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పగ్గాలు అందుకున్నాడు. రోహిత్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు బీసీసీఐ బుధవారం వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇటీవలే టీ20 ఫార్మాట్‌లో టీమిండియా జట్టుగా రోహిత్ కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో రోహిత్‌ను ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. తాజాగా వన్డే జట్టుకు సైతం రోహిత్‌నే కెప్టెన్‌ను చేస్తున్నట్టు పేర్కొంది. ఇక డిసెంబర్ 26న ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం.. టెస్టు జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. అజింక్య రహానె స్థానంలో రోహిత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
అయితే వన్డే కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీ వదులుకోనప్పటికీ విరాట్‌కు సెలక్షన్ కమిటీ షాకిచ్చింది. కోహ్లీని వన్డే సారథిగానూ తప్పుకోవాలని సెలక్టర్లు సూచిస్తూ రెండు రోజులు గడువు ఇవ్వగా.. అతడి నుంచి స్పందన లేకపోవడం వల్లే నిర్మొహమాటంగా వేటు వేసినట్లు సమాచారం. ఈ విషయం విరాట్ కోహ్లీ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. టీమిండియాకు కీలక బ్యాట్స్‌మెన్స్‌గా ఎన్నో విజయాలను అందించిన కోహ్లీ విషయంలో ఇలా జరగడం అభిమానులకు రుచించడం లేదు.
అందుకే హిట్‌మ్యాన్‌కు ఛాన్స్..?
అయితే మూడు ఫార్మాట్లలోనూ విరాట్‌కు కెప్టెన్‌గా మంచి రికార్డే ఉంది. అతను 95 వన్డేల్లో నాయకత్వం వహిస్తే 65 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గింది. 27 మ్యాచ్‌లు ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా.. 2 వన్డేల్లో ఫలితం రాలేదు. గెలుపు శాతం 70.43గా ఉంది. ఇక 66 టెస్టుల్లో 39 విజయాలతో భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. టీ20 విషయానికొస్తే 50 మ్యాచ్‌ల్లో 30 విజయాలు, 64.58 గెలుపు శాతంతో మంచి స్థాయిలోనే ఉన్నాడు. అయితే మ్యాచ్‌లు, సిరీస్‌లు ఎన్ని గెలిచినా ఐసీసీ ట్రోఫీ ఒక్కటీ కూడా సాధించకపోవడం కోహ్లీకి చేటు చేసింది. మరోవైపు ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా బెంగళూరుకు ఒక్కసారిగా కూడా కప్ అందిచలేకపోయాడు. ఇదే సమయంలో రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు విజేతగా నిలవడం కోహ్లీ నాయకత్వ లక్షణాలను ప్రశ్నార్థకం చేసింది. దీంతో సెలక్టర్లు హిట్ మ్యాన్‌కు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
బ్యాటింగ్ జోరు తగ్గింది..
కోహ్లీ ప్రస్తుత పరిస్థితికి కారణం బ్యాటింగ్ జోరు తగ్గడమే అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాను ప్రస్తుతం కెప్టెన్‌గా లేకపోవడం ఓ రకంగా మంచిదే అంటున్నారు సీనియర్లు. తనపై ఉన్న ఒత్తిడిని వీడి పూర్వపు ఫామ్‌ను కొనసాగించాలని వారు కోరుకుంటున్నారు. అలాగే.. ఒక సభ్యుడిగా జట్టులో కొనసాగుతూ, సీనియర్ ఆటగాడిగా రోహిత్‌కు సహకరించాలి. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్, ఆ తర్వాతి ఏడాది వన్డే ప్రపంచకప్ సాధన దిశగా అతడితో కలిసి జట్టును ముందుకు నడిపించాలని సీరియర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.