- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాధవన్ ‘రాకెట్రీ’ ట్రైలర్ చూసి ఏడ్చేసిన సమంత
దిశ, సినిమా : ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’. ఆర్.మాధవన్ లీడ్ రోల్ ప్లే చేస్తూ, డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సిమ్రన్ హీరోయిన్. కాగా ఈ రోజు (గురువారం) రిలీజైన చిత్ర ట్రైలర్ చూసి తాను ఏడ్చానని చెప్పుకొచ్చింది సమంత. ఏడాది కిందటే తాను సినిమా ట్రైలర్ చూశానని, ఈ సినిమా తెరకెక్కించేందుకు మాధవన్ చాలా కష్టపడ్డారని, ఆయన జీనియస్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది సామ్.
https://twitter.com/Samanthaprabhu2/status/1377584358253416452?s=20
నంబి నారాయణ్ రోల్ ప్లే చేస్తున్న మాధవన్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న సీన్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. తెలుగు, తమిళ్‌లో సూర్య ఇంటర్వ్యూయర్ రోల్ ప్లే చేయగా, హిందీలో షారుఖ్ ఖాన్ ఈ రోల్‌లో కనిపించబోతున్నాడు. ‘వీధి కుక్కను కొట్టి చంపాలంటే దానికి పిచ్చి అనే పటం కడితే సరిపోతుంది. అదే విధంగా ఓ మనిషిని తలెత్తనివ్వకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పటం కడితే చాలు’ అని సూర్య చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణ్ ఒకరు. కాగా ఒకానొక టైమ్‌లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి 50 రోజుల పాటు జైల్లో పెట్టారు. తర్వాత సుప్రీం కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఆ సైంటిస్ట్ జీవితాన్నే మాధవన్ తెరపై ఆవిష్కరించబోతున్నారు.