- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ అమలుకు రోబోల సహాయం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ నియమాలను చాలా మంది ఉల్లంఘిస్తుండటంతో పోలీసులను రంగంలోకి దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసులు కూడా మనుషులే కదా… వాళ్లకి కూడా కొవిడ్19 సోకే అవకాశాలు ఉన్నాయి కదా… అంతేకాకుండా అన్నిచోట్లా సరిపోయే పోలీసు బలగం కూడా అందుబాటులో ఉండకపోవచ్చు.
ఈ సమస్యను పరిష్కరించడానికే ట్యునీషియా ప్రభుత్వం రోబో కాప్‌లను కార్యసన్నద్ధం చేసింది. పీగార్డ్ పేరుతో పిలిచే ఈ రోబోకాప్‌లు ట్యునీషియ వీధుల్లో విధులు నిర్వహిస్తున్నాయి. కంట్రోల్ రూం నుండి ఆపరేట్ చేయడానికి వీలుగా ఉండే ఈ రోబోలలో ఇన్‌ఫ్రారెడ్, థర్మల్ ఇమేజ్ కెమెరాలు, సౌండ్, లైట్ అలారం సిస్టం ఉన్నాయి. దీని సౌండ్ సిస్టమ్ ద్వారా లాక్‌డౌన్ విధించిన ప్రాంతాల్లో ఎవరైనా కనిపిస్తే వారిని అడ్డగించి వివరాలు తెలుసుకుని, ఐడీ చూపించాలని అడిగే టెక్నాలజీని పొందుపరిచారు. మార్చి 17 నుంచి లాక్‌డౌన్ విధించినప్పటికీ ప్రజలు సరిగా పాటించకపోవడంతో మార్చి 22 నుంచి తీవ్రస్థాయిలో అమలు చేయడం మొదలుపెట్టారు. అందుకే పెద్ద మొత్తంలో పోలీసులను దింపారు. సరిపోనీ చోట రోబోకాప్‌లను ప్రవేశపెట్టారు. సెక్యూరిటీ పెట్రోలింగ్ కోసం ఉపయోగించే ఈ రోబోను అనిస్ సహబానీ సృష్టించారు.
Tags – Robocop, PGuard, Thermal, Imaging, Lockdown, Corona