- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎస్‌బీఐ బ్యాంకులో చోరీ.. భారీగా నగదు అపహరణ!
X
దిశ, భద్రాచలం(దుమ్ముగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకులో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఈ విషయం బుధవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. బ్యాంకు వెనుకవైపు తాళాలు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు గ్యాస్ కట్టర్లు ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారీగా నగదు చోరీ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. రికార్డ్ అయిన సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్యాంకు చోరీకి సంబంధించి పోలీసుల నుంచి అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సిఉంది.
Advertisement
- Tags
- Dummagudem
Next Story