బ్రిడ్జివాల్‎ను ఢీ కొన్న బైక్.. ఇద్దరు మృతి

by srinivas |   ( Updated:2020-11-24 21:20:40.0  )
బ్రిడ్జివాల్‎ను ఢీ కొన్న బైక్.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‎డెస్క్: విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. హైవే బ్రిడ్జివాల్‎ను బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విశాఖ జిల్లా పెదగంట్యాడకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story