- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫాస్ట్ ఫాస్ట్‌గా ఆ పని చేసినందుకు.. మీరా పరిస్థితి విషమం
దిశ, అన్నపురెడ్డిపల్లి: బొగ్గు టిప్పర్ల అతి వేగం అనేక ప్రమాదాలకు కారణం అవుతుంది. ఏటా ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అడ్డు అదుపులేకుండా టిప్పర్ డ్రైవర్లు వాహనాలు నడపటం మూలంగా ప్రమాదాలకు గురైన బాధితుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వెళ్లే బొగ్గు లారీల మూలంగా ఈ ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించి వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లారీల యజమానులు ఎక్కువ ట్రిప్పులు వేసేందుకు డ్రైవర్లను ఒత్తిడి చేయడం మూలంగానే ఈ ప్రమాదాలకు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. టిప్పర్ల వేగం తగ్గించేందుకు పోలీస్, రవాణా శాఖ అధికారులు దృష్టిసారించి లారీ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు
అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన పంచాయతీ సీతారామ కాలువ దగ్గర మంగళవారం రోడ్డుప్రమాదం జరిగింది. రెండు టిప్పర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ నాగుల మీరాకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.