కేసీఆర్ ఫాంహౌస్ వద్ద దారుణం

by Sumithra |
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద దారుణం
X

దిశ, వెబ్ డెస్క్ :
సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ మండలం ఎర్రవల్లి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిర్లక్ష్యంగా పడేసిన రాళ్ల లోడ్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళితే.. శ్రీగిరిపల్లెకు చెందిన భార్యభర్తలు మర్కుక్ వెళ్లే దారిలో ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. అదే సమయంలో వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలోై భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త శబద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రున్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బీబీ మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా రాళ్లు పడవేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story