అదుపు తప్పి బైకు బోల్తా.. ఇద్దరు మృతి

by Shyam |
అదుపు తప్పి బైకు బోల్తా.. ఇద్దరు మృతి
X

దిశ, తాండూరు: వికారాబాద్ జిల్లాలో ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం పెద్దేముల్ మండలం మారేపల్లి గేట్ సమీపంలో బైకు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మృతులు తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story