ఇద్దరిని బలిగొన్న అతివేగం

by Sumithra |
ఇద్దరిని బలిగొన్న అతివేగం
X

దిశ, వెబ్‌డెస్క్: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం పెద్ద తుప్రా వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీ కొని అదుపు తప్పి కరెంట్ స్తంబానికి ఢీ కొట్టింది బైక్. ఈ ప్రమాదంలో మహిళతో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed