- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నలుగురు స్పాట్‌డెడ్.. కారణం అదే!
X
దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు.. ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఢిల్లీకి చెందిన కాంచల్ సింగ్, మనోజ్ మిట్టల్, రేఖ, మహబూబ్ ఆలంగా పోలీసులు గుర్తించారు. వీరంతా కర్ణాటకలోని యశ్వంత్ పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో ఉన్న నలుగురు మృతి చెందడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.
Advertisement
Next Story