మదీనాగూడ వద్ద రోడ్డు ప్రమాదం..!

by Shyam |
మదీనాగూడ వద్ద రోడ్డు ప్రమాదం..!
X

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్ లోని మదీనాగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న బైకును లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. డైట్ సెట్ ఎగ్జామ్ రాసేందుకు బీహెచ్ఈఎల్ నుంచి కూకట్ పల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు జహీరాబాద్ కు చెందిన శ్వేత, శ్రీనివాస్ గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story