రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

by Sumithra |
accident
X

దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పాల కేంద్రం వద్ద ఎదురుగా వస్తున్న బులెరో వాహనాన్ని బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మ‌‌ృతి చెందగా… ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు డోర్నకల్‌కు చెందిన జహీరా, పాషాలుగా గుర్తించారు. ఖమ్మం నుంచి డోర్నకల్‌కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story