తల్లి ఆ పని చేసిందని తట్టుకోలేక బైకుపై బయలుదేరిన కొడుకు.. అంతలోనే

by Sumithra |   ( Updated:2021-09-12 22:58:22.0  )
తల్లి ఆ పని చేసిందని తట్టుకోలేక బైకుపై బయలుదేరిన కొడుకు.. అంతలోనే
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుందని తెలిసి చూడడానికి వెళ్తోన్న కుమారుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఖమ్మం జిల్లా మంచుకొండ సమీపంలోని శివాయిగూడెం వద్ద జరిగిన ఘెర రోడ్డు ప్రమాదంలో సురేష్ అనే యువకుడు మృతిచెందాడు.

వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన కౌసల్య అనే మహిళ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పక్క ఊర్లో ఉన్న ఆమె కుమారుడు సురేష్ కి ఈ విషయం తెలిసింది. దీంతో తన దగ్గర బంధువైన మరో వ్యక్తి తో బైక్ పై తల్లిని చూడడానికి బయల్దేరాడు. మంచుకొండ సమీపంలోని శివాయిగూడెం వద్దకు వచ్చేసరికి వారి బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేష్ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, బంధువు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఒకే ఇంట్లో గంట వ్యవధిలో రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed