డివైడర్‌ను ఢీకొట్టి లారీ బోల్తా.. ఇద్దరు మృతి

by Sumithra |
accident
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ వద్ద ఓఆర్ఆర్‌పై ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం అతివేగంగా వచ్చిన లారీ డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story