అనంతపురంలో భయానక రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

by Mahesh |   ( Updated:2021-12-06 01:01:38.0  )
Road-Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గుమ్మగట్ట మండలంలోని పూలకుంట వద్ద ఆటోను బొలేరో జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story