ప్రేమ పెళ్లికే ఓటేస్తున్న..‘రితూ పాప’

by Shyam |   ( Updated:2020-06-22 05:59:49.0  )
ప్రేమ పెళ్లికే ఓటేస్తున్న..‘రితూ పాప’
X

రితూ వర్మ.. పక్కింటి అమ్మాయిలా కనిపించే అందాల బొమ్మ. బాద్‌షా సినిమాలో కాజల్ అగర్వాల్ చెల్లిగా కనిపించిన రితూ.. పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటించి మెప్పించింది. తాజాగా దుల్కర్ సల్మాన్‌తోనూ ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాలో జతకట్టిన భామ.. ఇటు శాండల్‌వుడ్‌లో సత్తా చాటుతునే.. అటు కోలీవుడ్‌లోనూ ఎంటర్ అవుతోంది.

కానీ ఇదే సమయంలో తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారని తెలిపింది. అందుకు తనకు కొంచెం టైమ్ కావాలని కోరిన రితూ.. ఆ లోపు నచ్చిన వ్యక్తి దొరుకుతాడని ఆశపడుతోందట. కాగా, తనకు పెద్దలు కుదిర్చిన సంబంధం కన్నా ప్రేమ పెళ్లి చేసుకోవడమే ఇష్టమని చెప్తోంది రితూ. కాగా, తెలుగులో నాని సరసన టక్ జగదీష్‌తో పాటు మరో రెండు సినిమాల్లోనూ నటిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed