మీట్ వితౌట్ మీట్ అంటున్న బాలీవుడ్ జంట

by Shyam |
మీట్ వితౌట్ మీట్ అంటున్న బాలీవుడ్ జంట
X

దిశ, వెబ్ డెస్క్: కోడి మాంసం లేకుండా చికెన్ తినడం సాధ్యమా? మేక మీట్ లేకుండా మటన్ తినడం సాధ్యమా? కాదు కదా. కానీ, బాలీవుడ్ జంట రితేష్ దేశ్‌ముక్, జెనీలియాలు తాము తినిపిస్తామని అంటున్నారు. మరి ఆ సీక్రెట్ ఏంటీ? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

బాలీవుడ్ జంట రితీష్ దేశ్‌ముఖ్‌, జెనీలియా కొన్నేండ్లుగా మాంసాహారానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, జాన్ అబ్రహం, షాహిద్ కపూర్, అనుష్క శర్మ, అలియా భట్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ ఇలా ఎంతోమంది బాలీవుడ్ సెలెబ్రిటీలు వెజటేరియన్స్‌గా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే బాలీవుడ్ కపుల్స్ జెనెలియా, రితేష్‌లు మీట్ వితౌట్ మీట్ అంటూ వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఇమేజిన్ మీట్స్’ పేరుతో ఈ వెంచర్‌ను త్వరలో ప్రారంభించనున్నామని అధికారింగా ఈ జంట ప్రకటించింది. ‘ఇమేజిన్ మీట్స్’ బ్రాండ్‌ కింద మొక్కల ఆధారంగా రూపొందించే మాంసాహార ఉత్పత్తులను అందించనుంది. ఈ ఉత్పత్తుల వాసన, రుచి నిజమైన మాంసాహారాన్ని పోలి ఉంటాయని వారు చెబుతున్నారు. బఠానీ ప్రోటీన్, కొబ్బరి నూనె వంటి మొక్కల పదార్థాల నుంచి తయారు చేస్తారట. ఈ వివరాలను రితీష్‌, జెనీలియా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అంతేకాదు.. ‘ఇమేజిన్ చికెన్ వితౌట్ చికెన్ ’, ‘ఇమేజిన్ మటన్ వితౌట్ మటన్’ అంటూ అప్పుడే పబ్లిసిటీ కూడా మొదలుపెట్టారు. మరికొన్ని రోజుల్లోనే దీన్ని ప్రారంభిస్తామని, మా జర్నీ ఇప్పుడే ప్రారంభించామని నైస్ టూ ‘మీట్’ యూ అని ఆ జంట తెలిపింది.

Advertisement

Next Story