బ్రేకింగ్.. రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్

by Shyam |   ( Updated:2021-07-15 01:06:34.0  )
Rishabh Pant
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన అతడికి కరోనా టెస్టు చేయగా పాజిటివ్‌గా తేలడంతో.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియాతో కలిసి పంత్ డర్హమ్‌కు వెళ్లడం లేదని తెలుస్తోంది. అయితే ఈ వార్తను బీసీసీఐ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కొన్ని వారాల క్రితం పంత్ వెంబ్లే స్టేడియం పరిసరాల్లో స్నేహితులను కలిశాడు. వారి ద్వారా సోకిందా? అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు టీమిండియా క్రికెటర్లకు కరోనా సోకిందనే వార్తలు వినిపిస్తున్నాయి. యూకేలో వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ సోకినట్లు తెలుస్తోంది. అయితే మరో క్రికెటర్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story