- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేయూలో అల్లర్లు: అర్ధరాత్రి యూనివర్సిటీలో హై టెన్షన్ (వీడియో)
దిశ, కేయూ క్యాంపస్: కాకతీయు విశ్వవిద్యాలయంలో రెండు వేర్వేరు గ్రూపులకు చెందిన విద్యార్థులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి భోజనాల సమయంలో చోటు చేసుకోగా.. అర్ధరాత్రి వరకూ కొనసాగింది. దీంతో యూనివర్సిటీలో హై టెన్షన్ క్రియేట్ అయింది. ఓ దశలో విద్యార్థులను పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. విద్యార్థుల మధ్య మొదలైన చిన్న విషయం గొడవకు దారితీసినట్లుగా తెలుస్తోంది. వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చదువుతున్న ఓ విద్యార్థినిని కేయూ ఫస్ట్‌గేట్ నుంచి వెళ్తుండగా కామెంట్ చేశారని సమాచారం.
ఈ విషయం విద్యార్థిని తోటి విద్యార్థులకు తెలపడంతో సోమవారం రాత్రి భోజనాలు చేస్తున్న సమయంలో కామెంట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంసీఏ విద్యార్థులపై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఎంసీఏ విద్యార్థులపై దాడికి పాల్పడిన విషయం వారి తోటి విద్యార్థులకు, కొంతమంది పీజీ విద్యార్థులకు తెలియడంతో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విద్యార్థులుంటున్న హాస్టల్‌పై దాడికి యత్నించారు. ఈ క్రమంలో కేయూలో జరుగుతున్న అలర్లపై సమాచారం అందుకున్న యూనివర్సిటీ పోలీస్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా కొద్దిసేపటి వరకు అదుపులోకి రాలేదు. అనంతరం ఇరువర్గాల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసులు నమోదు చేయకుండా.. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడనున్నట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.