సినిమాల్లో మహిళలు ఫర్నిచర్‌తో సమానం.. నటి సంచలన వ్యాఖ్యలు

by Jakkula Samataha |
సినిమాల్లో మహిళలు ఫర్నిచర్‌తో సమానం.. నటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి రిమీ సేన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతోంది. బాలీవుడ్‌లో సరైన క్యారెక్టర్స్ దక్కక డిజప్పాయింట్‌తో గతంలో సినిమాల నుంచి క్విట్ అయినట్లు తెలిపిన ఆమె.. ప్రస్తుతం అంతే వేగంగా దూసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది. ఒకప్పుడు సినిమాలు కేవలం మగవారి కోసం మాత్రమే తీసేవారని.. అందులో మహిళలు ఫర్నిచర్ లాంటి వారని అభిప్రాయపడిన రిమీ సేన్.. ప్రస్తుతం కూడా మేల్ డామినేషన్ ఉన్నప్పటికీ, అమ్మాయిలకు ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటోందని తెలిపింది.

గతంలో ఉమన్ ఓరియంటెడ్ మూవీస్ చేసినా వర్కౌట్ కాలేదని.. కానీ షూజిత్ సర్కార్, శ్రీరామ్ రాఘవన్ లాంటి దర్శకులు ఆ పరిస్థితిని మార్చేశారని చెప్పింది. ఓటీటీ ద్వారా మహిళలకు మంచి కథ, పాత్రలు దక్కుతున్నాయని, అక్కడ వారు చేయాల్సింది చాలా ఉందని తెలిపింది. కథను బట్టి క్యారెక్టర్స్ నడుస్తున్నాయి కాబట్టి వయస్సుతో సంబంధం లేదని అభిప్రాయపడింది.

అంతకు ముందు హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తక్కువగా ఉండేదన్న రిమీ సేన్.. ఆ సమయంలో ఫిట్‌గా ఉన్న మరో హీరోయిన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే ఏదో భయం వెంటాడేదని చెప్పింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి, 50 ఏళ్ల వయసు పైబడిన యాక్టర్స్ కూడా మంచి రోల్స్ పొందుతున్నారని తెలిపింది.

Advertisement

Next Story