రిలయన్స్‌ను దాటేసిన టీసీఎస్!

by Harish |
రిలయన్స్‌ను దాటేసిన టీసీఎస్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా భయాలతో పాటు, దేశీయ ప్రతికూల అంశాలు సోమవారం నాటి మార్కెట్‌ను భారీ పతనంలోకి తోసేసింది. అయితే, నిన్నటి పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లనే కాకుండా దేశీయంగా అత్యంత విలువైన కంపెనీల స్థాయిలను కూడా తారుమారు చేసింది. ఇదివరకు దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీల్ సంస్థ మార్కెట్ల పతనంతో 13 శాతానికి పైగా క్షీణించింది. దీంతో రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 10 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ. 7.05 లక్షల కోట్లకు దిగజారింది. ఈ అనూహ్య పరిణామాలతో గడిచిన పదేళ్ల నుంచి అత్యంత విలువైన కంపెనీగా ఎదుగుతున్న రిలయన్స్ షేర్ ధర అమాంతం కూలిపోయింది. రిలయన్స్‌ను దాటి దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ సంస్థకు చెందిన టీసీఎస్ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది.

టీసీఎస్ షేర్ ధర సోమవారం మార్కెట్ ప్రభావంతో క్షీణించినప్పటికీ రిలయన్స్ కంటే సగం అంటే 6 శాతానికి మాత్రమే పరిమితమైంది. దీంతో టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 7.40 లక్షల కోట్లకు పెరిగి, ఇండియాలో అత్యంత విలువైన సంస్థగా టీసీఎస్ నిలిచింది. రిలయన్స్ సంస్థ దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం కలిగి ఉంది. రిలయన్స్‌ వ్యాపారంలో అధిక భాగం చమురుదే. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గడంతో ఆ ప్రభావం రిలయన్స్ సంస్థపై పడింది. ప్రపంచ మార్కెట్లో 1991 తర్వాత ఒక్కరోజులోనే 30 శాతానికి పైగా చమురు ధరలు పడిపోయాయి.

Tags: RIL share price, Reliance, tcs, most valuable company

Advertisement

Next Story

Most Viewed