బిల్‌గేట్స్ సంస్థలో రిలయన్స్ పెట్టుబడి

by Harish |
బిల్‌గేట్స్ సంస్థలో రిలయన్స్ పెట్టుబడి
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) సంస్థ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రారంభించిన సంస్థలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనుంది. పర్యావరణ మార్పులపై పోరాటం కోసం బిల్‌గేట్స్ బ్రేక్ థ్రూ ఎనర్జీ వెంచర్స్ (BEV) సంస్థలో ఆర్ఐఎల్ సుమారు రూ. 370 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో రిలయన్స్ పేర్కొంది. తద్వారా రిలయన్స్ బీఈవీలో 5.75 శాతం వాటాను దక్కించుకోనుంది. అలాగే, ఈ మేరకు ఒప్పందం కుదిరిందని, పెట్టుబడుల బదిలీ కోసం ఆర్‌బీఐ నుంచి అనుమతి కూడా లభించినట్టు తెలిపింది. రానున్న 10 ఏళ్ల కాలంలో ఈ పెట్టుబడులను పెట్టనున్నట్టు రిలయన్స్ వెల్లడించింది. కాగా, బిల్‌గేట్స్ బ్రేక్ థ్రూ ఎనర్జీ వెంచర్స్ సంస్థను 2015లో ప్రారంభించారు. ప్రపంచాన్ని ఉద్గారరహిత ఆవిష్కరణలకు మద్దతుగా దీన్ని తీసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed