గతేడాది 75 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన రిలయన్స్

by Harish |
గతేడాది 75 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన రిలయన్స్
X

దిశ, వెబ్ డెస్క్: కొవిడ్ మహమ్మారి వల్ల అనేక ఆటంకాలు ఉన్నప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 75,000 మందికి పైగా ఉద్యోగాల్లో నియమించినట్టు తన వార్షిక నివేదికలో తెలిపింది. అంతేకాకుండా అదనంగా 50 వేల మందికి పైగా ఫ్రెషర్లను నియమించినట్టు వెల్లడించింది. దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ అయిన రిలయన్స్ తన అనుబంధ సంస్థలన్నిటిలో కలిపి 2,30,000 మంది ఉద్యోగులు ఉన్నారని, గతేడాది కొత్తగా 75 వేల మందిని చేర్చుకుంది. ఇందులో రిలయన్స్ రిటైల్ విభాగం అత్యధికంగా 65 వేల మందిని నియమించింది.

కరోనా అనిశ్చిత పరిస్థితుల మధ్య ఉద్యోగుల శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలను అమలు చేసినట్టు తెలిపింది. అలాగే, ఐఐఎం, ఐఎస్‌బీ, ఐఐటీ, ఎన్ఐటీ, బిట్స్, ఐసీఏఐ లాంటి ప్రముఖ సంస్థల నుంచి ఏడాది కాలంలో కంపెనీ 50 వేల మందికి పైగా ఫ్రెషర్లను నియమించింది. సంస్థ టర్నోవర్ 18.3 శాతం క్షీణించి రూ. 5.39 లక్షల కోట్లకు చేరుకున్నప్పటికీ, ఆర్ఐఎల్ నికర లాభం 34.8 శాతం పెరిగి రూ. 53,739 కోట్లుగా నమోఐంది. సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ సంస్థ వృద్ధి ప్రణాళికలను అమలు చేస్తూనే వచ్చిందని, బలమైన నిర్వహన నగదును కలిగి ఉందని, అతిపెద్ద మూలధన పెంపు ద్వారా బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసిందని ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed